జూబ్లీహిల్స్ బై పోల్ వేళ బీజేపీకి షాక్.. షేక్పేట్ డివిజన్ బీజేపీ కంటెస్టడ్ కార్పొరేటర్ రాజీనామా
హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్, షేక్పేట్ డివిజన్ బీజేపీ కంటెస్టడ్ కార్పొరేటర్ చెర్క మహేష్ బీజేపి సభ్యత్వానికి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావుకు, కేంద్ర మంత
షేక్ పేట బిజెపి


హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్, షేక్పేట్ డివిజన్ బీజేపీ

కంటెస్టడ్ కార్పొరేటర్ చెర్క మహేష్ బీజేపి సభ్యత్వానికి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావుకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుండి నేను బీజేపీ పార్టీకి నిజాయితీగా, అంతఃకర్ణ శుద్ధితో పనిచేశాను. నేను నమ్మిన రాజకీయాలు ప్రజలకు సేవ చేసి రాష్ట్రానికి బలోపేతం చేయడం. కానీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు సరిగ్గా పట్టించుకోలేదు. రైతులు, యువకులు, మహిళలు, కుల వృత్తుల కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande