బోథ్ పట్టణాన్ని మోడల్ బోథ్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, 11 అక్టోబర్ (హి.స.) బోథ్ పట్టణాన్ని మోడల్ బోథ్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు కూడళ్లను, వీధుల్లో నాయకులతో, ఆర్అండ్ బీ, పీఆర్ శాఖ అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. బీడీ కార్మికుల సమస్యలను
ఎమ్మెల్యే అనిల్ జాదవ్


ఆదిలాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

బోథ్ పట్టణాన్ని మోడల్ బోథ్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు కూడళ్లను, వీధుల్లో నాయకులతో, ఆర్అండ్ బీ, పీఆర్ శాఖ అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. బీడీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలనీల్లో ఉన్న రోడ్లను స్వయంగా పరిశీలించామని తెలిపారు. బోథ్ పట్టణం లో రూ. 10 కోట్లతో త్వరలోనే ప్రధాన కూడళ్ళను కలుపుకుని రోడ్డు నిర్మిస్తామని, పొచ్చేర ఎక్స్ రోడ్ నుండి బోథ్ వరకు రూ. 18 కోట్లతో సెంట్రల్ లైటింగ్ కొరకు ప్రతిపాదనలు పంపామన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా మోడల్ బోథ్ గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. బోథ్ లో డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఎలక్షన్ల సమయంలోనే రాజకీయం.. ఆ తర్వాత అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande