హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్
పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కోటి రూపాయలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీలో సీసీ టీవీలు పరిశీలించగా విస్తురపోయే నిజాలు బయటపడ్డాయి. సీసీటీవీలో ఒక్కడే దొంగతనానికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దుండగుడు ముఖానికి మాస్క్, చేతులకు గౌజులతో కనిపిస్తున్నాడు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నింధితుడిని బత్తుల ప్రభాకర్ గా అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే చోరీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బత్తుల ప్రభాకర్ అనేక కేసుల్లో నింధితుడిగా ఉన్నాడు. గతంలో హైదరాబాద్ పోలీసులపై సైతం కాల్పులు జరిపాడు. నింధితుడిపై ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు ఉండగా గతేడాది ఏపీ పోలీసుల చేతి నుండి తప్పించుకున్నాడు. కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసుల కల్లుగప్పి పారిపోయాడు. గతంలోనూ కాలేజీలే లక్ష్యంగా ప్రభాకర్ దొంగతనాలకు పాల్పడ్డాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..