తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం
తిరుపతి 11 అక్టోబర్ (హి.స.), తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీలో మరోసారి చిరుత కలకలం రేగింది. గత రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోకి చిరుత వచ్చింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెటర్నరీ, వేదిక్, ఎస్వీ యునివర్సిటీలో చిర
తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం


తిరుపతి 11 అక్టోబర్ (హి.స.), తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీలో మరోసారి చిరుత కలకలం రేగింది. గత రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోకి చిరుత వచ్చింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెటర్నరీ, వేదిక్, ఎస్వీ యునివర్సిటీలో చిరుతలను పట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ కూడా రాత్రిపూట బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande