దుర్గా గుడి పాలక మండలి చైర్మన్,సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ.రోజు జరిగింది
విజయవాడ, 11 అక్టోబర్ (హి.స.)దుర్గగుడి పాలక మండలి చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు (శనివారం) జరిగింది. రాజగోపురం ముందు ఈవో సినానాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు అయ్యింది. ప్రమాణ స్వీకారం అనంతరం
దుర్గా గుడి పాలక మండలి చైర్మన్,సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ.రోజు జరిగింది


విజయవాడ, 11 అక్టోబర్ (హి.స.)దుర్గగుడి పాలక మండలి చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు (శనివారం) జరిగింది. రాజగోపురం ముందు ఈవో సినానాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు అయ్యింది. ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గగుడి ఛైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ.. ఈ రోజు గొప్పగా ప్రమాణ స్వీకారం జరగటం సంతోషంగా ఉందన్నారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం మా పూర్వీకుల సుకృతమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు రాధాకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande