లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్..
యాదగిరిగుట్ట, 11 అక్టోబర్ (హి.స.) తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో రవి నాయక్లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పో
హై కోర్ట్ చీఫ్ జస్టిస్


యాదగిరిగుట్ట, 11 అక్టోబర్ (హి.స.) తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో రవి నాయక్లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ ఈవో రవి నాయక్ చీఫ్ జస్టిస్కు స్వామివారి ప్రసాదం, చిత్రపటాలను బహుకరించారు. ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. శరత్, జస్టిస్ కె. సుజన, జస్టిస్ వి. రామకృష్ణా రెడ్డిలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ గోపిరెడ్డి వీరారెడ్డి, డీసీపీ అక్షాంశ్ యాదవ్, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, యాదగిరిగుట్ట ఎమ్మార్వో గణేష్ నాయక్ తదితరులున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande