ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. వచ్చేవారం మళ్లీ కుండపోత వానలు!
అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)దక్షిణ ఒడిశా నుండి కోస్తా ఆంధ్ర తీరం రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మహబూబాబాద
heavy rain


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)దక్షిణ ఒడిశా నుండి కోస్తా ఆంధ్ర తీరం రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ, ఏపీ మీదుగా కొనసాగుతున్న ద్రోణికి ఉపరితల ఆవర్తనం తోడైంది. దీని ప్రభావంతో అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రేపటికి (అక్టోబర్‌ 12) అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande