కిక్కు ఇవ్వని మద్యం టెండర్లు.. మందకొడిగ టెండర్ల ప్రక్రియ..
ఆసిఫాబాద్, 11 అక్టోబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లు కిక్కు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వచ్చే మద్యం టెండర్ల ప్రక్రియ చేపట్టి 15 రోజులు కావస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు అనుకున్న స్థాయిలో టెండర్లు రాలేదు.
మద్యం టెండర్లు


ఆసిఫాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో

మద్యం టెండర్లు కిక్కు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వచ్చే మద్యం టెండర్ల ప్రక్రియ చేపట్టి 15 రోజులు కావస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు అనుకున్న స్థాయిలో టెండర్లు రాలేదు. దీంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అందించే ఈ వ్యాపారాన్ని చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఈ సారి ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేనట్లు కనిపిస్తోంది. జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లో 16 చొప్పున 32 మద్యం షాపులు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు కేవలం 49 దరఖాస్తులు వచ్చాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande