ములుగు,11 అక్టోబర్ (హి.స.)ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండులో నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పోచమ్మ గుడికి ఎలాంటి ఆటంకం కలగకుండా పనులను పూర్తి చేయాలని, అలాగే బస్టాండు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులో తీసుకురావాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఉదయం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, సంబంధిత అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. నూతన బస్టాండ్ నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, పనులను సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా బస్టాండ్ మధ్యలో గల పోచమ్మ గుడికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని, ఆధునిక సౌకర్యాలతో మోడల్ బస్ స్టాండ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు