ఖమ్మం, 11 అక్టోబర్ (హి.స.)
రైతును రాజును చేయడం,పేదలకు సొంత ఇల్లు ఇవ్వడం, ప్రతి అర్హులకు రేషన్ కార్డు అందించడం.. ఇదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లో వారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముజ్జుగూడెం గ్రామంలో ముజ్జుగూడెం నుండి గువ్వలగూడెం వరకు రూ.2.60 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి, పైనంపల్లి గ్రామంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడ తగ్గనీయకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు