నిర్మల్, 11 అక్టోబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా ముధోల్, తానూర్ మండల కేంద్రాలలోని వైన్సు షాపులలో చోరీలకు పాల్పడ్డ దుండగులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శనివారం భైంసా పట్టణంలోని ఎస్.డి.పి.ఓ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలీ గ్రామానికి చెందిన ఆరుగురు దుండగులు ముధోల్ కేంద్రంలోని వైన్స్లో రెండు లక్షల 50 వేల రూపాయలు, తానూర్ కేంద్రంలోని వైన్ షాపులో దాదాపు 80 వేల రూపాయలను చోరీ చేశారన్నారు. అంతేకాకుండా ఇక్కడి బాటిల్స్ ను తీసుకెళ్లి రెంజల్ మండలంలోని బెల్ట్ షాపులలో విక్రయించారన్నారు. ముధోల్ ఎన్హెచ్వో, తానుర్ ఎన్హెచ్వోలు టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో దుండగులను పట్టుకున్నారన్నారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సిస్ తానుర్ ఎస్ఐ జుబేర్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు