ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. సరైన ఆధారాలు లేవని పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు ఆదాయ వివరాలు సమర్పించడంతో పాటు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి కాటా శ్రీన
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి


హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు ఆదాయ వివరాలు సమర్పించడంతో పాటు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు, ఆదాయ వివరాలు తప్పుడుగా సమర్పించడంతో పాటు ఎన్నికల్లో అవినీతి కార్యకలాపాలు చేసి ఓటర్లను ప్రభావితం చేసి గెలుపొందిన ఎమ్మెల్యే శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాటా దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. సరైన ఆధారాలు లేనందున పిటిషన్ను కొట్టి వేసింది. హై కోర్టులో మహిపాల్ రెడ్డి తరఫున న్యాయవాది నవీన్ కుమార్ వాదనలు వినిపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande