భైంసా బస్టాండ్లో ఏ.టి.ఎం మిషన్ ను పగలగొట్టిన దుండగులు..
నిర్మల్,11 అక్టోబర్ (హి.స.) నిర్మల్ జిల్లా భైంసా బస్టాండ్లో ఉన్న ఏ.టి.ఎం మిషన్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, చోరికి యత్నించగా, అది విఫలం ఆయన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏ.టి.ఎం మిషన్లో ఉన్న క్యాష్ పోలేదు. అయితే మిషన్ను
ఏటీఎం


నిర్మల్,11 అక్టోబర్ (హి.స.)

నిర్మల్ జిల్లా భైంసా బస్టాండ్లో ఉన్న ఏ.టి.ఎం మిషన్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, చోరికి యత్నించగా, అది విఫలం ఆయన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏ.టి.ఎం మిషన్లో ఉన్న క్యాష్ పోలేదు. అయితే మిషన్ను ధ్వంసం చేసేందుకు తెచ్చుకున్న ఆయుధాలు గుర్తు తెలియని దుండగులు అక్కడే వదిలి వెళ్ళారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్లో ఇలాంటి ఘటన జరగడంతో జనాలు ఉలిక్కి పడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande