వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. ముగ్గురికి గాయాలు
వికారాబాద్, 11 అక్టోబర్ (హి.స.) వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధిత కుటుంబీకుల తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం, రావులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్, కుమ్మరి రాజు(35), పాశం శ్రీశైలం, నల్
రోడ్డు యాక్సిడెంట్


వికారాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధిత కుటుంబీకుల తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం, రావులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్, కుమ్మరి రాజు(35), పాశం శ్రీశైలం, నల్లోల్ల నరసింహులు పరిగి మండలం చిట్యాల నుంచి స్వగ్రామమైన రావులపల్లికి బొలెరో వాహనం లో శుక్రవారం రాత్రి బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటాం అనగానే బొలెరో వాహనం ఇంజన్ నుంచి టైర్లు తిప్పే కనెక్టింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో పరిగి మండలం ఖుదా వంద్ పూర్ శివారులో బొలెరో వాహనం అదుపుతప్పి పల్టీలు పడుకుంటూ వెళ్ళింది. ఈ ప్రమాదంలో కుమ్మరి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లోల్ల నరసింహులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సలు అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande