వాహన అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ నిషేధం: సూర్యాపేట పోలీసులు
సూర్యాపేట, 11 అక్టోబర్ (హి.స.) వాహన అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయకూడదని అది పూర్తిగా నిషేధమని సూర్యాపేట పోలీసులు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండలం సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్ల
సూర్యాపేట పోలీస్


సూర్యాపేట, 11 అక్టోబర్ (హి.స.)

వాహన అద్దాలకు బ్లాక్ ఫిల్మ్

వేయకూడదని అది పూర్తిగా నిషేధమని సూర్యాపేట పోలీసులు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండలం సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనాల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వాడటం మోటార్ వాహన చట్టానికి వ్యతిరేకమన్నారు. ఇది నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల పై ప్రయాణించే వాహనదారులందరూ చట్టానికి లోబడి ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. నియమావళిని ఉల్లంఘించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande