విశాఖ లో వచ్చే నెలలో లక్ష కోట్లతో టీ సీ ఎస్ డేటా సెంటర్ ప్రారంభం
అమరావతి, 11 అక్టోబర్ (హి.స.) : ఆంధ్రప్రదేశ్‌‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అమరావతిని అత్యున్నత ర
విశాఖ లో వచ్చే నెలలో లక్ష కోట్లతో టీ సీ ఎస్ డేటా సెంటర్ ప్రారంభం


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)

: ఆంధ్రప్రదేశ్‌‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అమరావతిని అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూనే, అదే సమయంలో సాగర నగరం విశాఖను ఐటీ హబ్ గా నిలబెట్టేందుకు విశేష కృషి కనబరుస్తున్నారు.

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖపట్నం పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుండగా, ఇప్పుడు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆసక్తి చూపించడం మరో అద్భుతమే అని చెప్పాలి. మరోవైపు, విశాఖలో టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande