ఈనెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై ప్రధాన చర్చ
హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్థరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న
తెలంగాణ క్యాబినెట్


హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్థరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు.. 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42 శాతంలో బీసీలకు 25 శాతం రిజర్వేషన్ కేటాయించి.. మిగతా 17 శాతాన్ని జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై సర్కార్. సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈనెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande