బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా.. పాతపద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్
తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల

నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా.. పాతపద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టాలని కోరుతూ.. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. జీఓం అమలుకోసం సుప్రీంను ఆశ్రయించాలని అధికారులు, మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, అభిషేక్ సింఘ్వీలతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande