సీఎం అల్లర్లు సృష్టిస్తారా? మమతపై బీజేపీ ఫైర్
కోల్కత్తా, 11 అక్టోబర్ (హి.స.) పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. ఈసీని బెదిరిస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ
bjp-slams-cm-mamata-for-trying-to-incite-riots-against-sir-482865


కోల్కత్తా, 11 అక్టోబర్ (హి.స.)

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. ఈసీని బెదిరిస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ సామిక్ భట్టాచార్య ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఎస్ఐఆర్ చేపడితే రాష్ట్రల్లో అల్లర్లు సృస్టించాలని, హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఆమె అనుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

దేశ విభజన సమయంలో వెళ్లిపోయిన వాళ్లు తిరిగి రావడానికి ఇదేం ధర్మసత్రం కాదని, అలా వచ్చిన వారిని గుర్తించి వారి దేశాలకు పంపేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎస్ఐఆర్ చేపడితే నకిలీ ఓట్లన్నీ పోతాయని మమతు భయమని బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ విమర్శించారు. బెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బిహార్ ఎస్ఐఆర్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని సీఎం మమత తప్పుబట్టారు. బీజేపీ అగ్నితో ఆటలాడుతోందని, ఓట్లు తొలగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బెంగాల్ ప్రజలు బీజేపీని ఎన్నటికీ నమ్మరని తేల్చిచెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande