నాపై కొందరు కుట్ర పన్నుతున్నారు: బొత్స సత్యనారాయణ
విజయనగరం, 11 అక్టోబర్ (హి.స.)వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ క
నాపై కొందరు కుట్ర పన్నుతున్నారు: బొత్స సత్యనారాయణ


విజయనగరం, 11 అక్టోబర్ (హి.స.)వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ విజయనగరంలో మీడియా సమావేశంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేశారు.

వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్, సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందని ఆయన ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande