‌ ‌మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు
కృష్ణా జిల్లా, 11 అక్టోబర్ (హి.స.) ,:మాజీ మంత్రి పేర్నినానిపై కేసు నమోదు అయ్యింది. ఆర్ పేట సీఐ యేసుబాబుపై నిన్న (శుక్రవారం) పేర్ని నాని, వైసీపీ నేతలు దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్‌స్ట
‌ ‌మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు


కృష్ణా జిల్లా, 11 అక్టోబర్ (హి.స.)

,:మాజీ మంత్రి పేర్నినానిపై కేసు నమోదు అయ్యింది. ఆర్ పేట సీఐ యేసుబాబుపై నిన్న (శుక్రవారం) పేర్ని నాని, వైసీపీ నేతలు దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకున్న ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాదా గిరి దిగారు పేర్నినాని. గతంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిరసనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేని నిరసనకు వెళ్తున్నారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande