కర్నూలు , 11 అక్టోబర్ (హి.స.)ఈ నెల 16న ప్రధాన మంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.
కర్నూలు శివారులోని నన్నూరు టోల్ గేట్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషలాఫీసర్ వీర పాండియన్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను దర్శించుకున్న తర్వాత ప్రధాన మంత్రి కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరులో నిర్వహించే జీఎస్టీ 2.0 బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మ్యాప్ ద్వారా హెలిప్యాడ్, సభ ప్రాంగణం, అప్రోచ్ రోడ్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV