ప్రధాని మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్
ఢిల్లీ, 11 అక్టోబర్ (హి.స.) ప్రధాని మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు
Modi


ఢిల్లీ, 11 అక్టోబర్ (హి.స.)

ప్రధాని మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం ఆయన 11.10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు వెళతారు.

ఈ సందర్భంగా ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం తరవాత మధ్యాహ్నం 1.40 గంటలకు సుందిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు వెళతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనుండగా తరవాత తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande