ఆరోగ్యశ్రీని చంపే కుట్ర జరుగుతోంది: విడదల రజిని
అమరావతి, 11 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సంజీవని అయిన
vidadala-rajini-alleges-conspiracy-to-destroy-aarogyasri


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సంజీవని అయిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం ‘అనారోగ్యశ్రీ’గా మారిపోయిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.

ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు సుమారు 3 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని విడదల రజిని తెలిపారు. బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు. దీంతో చేసేదేమీ లేక నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేసి, బోర్డులు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైద్య సేవలు నిలిచిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. పీహెచ్‌సీ డాక్టర్లు, నెట్‌వర్క్ డాక్టర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని మండిపడ్డారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల నుంచి 3,257కి పెంచామని, నెట్‌వర్క్ ఆసుపత్రులను 900 నుంచి 2,300కి విస్తరించామని రజిని గుర్తుచేశారు. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య ఆసరా వంటి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీని చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande