అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)
పల్నాడు: జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపింది. వెల్దుర్తి మండలం దావుపల్లితండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మెలియాయిడోసిస్ పాజిటివ్‌గా బయటపడింది. దీంతో రోగిని అధికారులు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో జిల్లా వైద్యాధికారి రవి పర్యటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ