పొన్నం వర్సెస్ అడ్లూరి వివాదంపై మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్, 12 అక్టోబర్ (హి.స.) మంత్రి పొన్నం వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివాదంపై ఇవాళ నిజామాబాద్లో జరిగిన మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారని అన్నారు. నేను మాల క
మంత్రి వివేక్


నిజామాబాద్, 12 అక్టోబర్ (హి.స.) మంత్రి పొన్నం వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివాదంపై ఇవాళ నిజామాబాద్లో జరిగిన మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారని అన్నారు. నేను మాల కావడం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారని వివేక్ ను విమర్శించడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు చూస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను ఇన్ చార్జిగా ఉన్నానని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాకు మంచి పేరు వస్తుందనే విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని, కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande