రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గడ్డం వివేక్
మంచిర్యాల, 12 అక్టోబర్ (హి.స.) రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్
మంత్రి వివేకానంద


మంచిర్యాల, 12 అక్టోబర్ (హి.స.)

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన బాధితులందరికీ పరిహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్ట ప్రకారం.. అర్హులైన బాధితులకు పరిహారం అందిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ. 11 వేల కోట్ల వరకు పూర్తి చేశారని.. మిగిలిన రూ.25 వేల కోట్ల పనులు పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతంలో 55 వేల ఎకరాల ఆయకట్టు భూమిలో రైతులు అధిక దిగుబడితో పంట సాగు చేసేవారన్నారు. భూములు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా బ్యాక్ వాటర్ తో పంట పొలాలు, కొన్ని నివాస ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు ఎంతో నష్టపోయారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande