బీజేపీ కుట్ర వల్లే 42% రిజర్వేషన్లకు అడ్డంకి.. పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి
నాగర్ కర్నూల్, 12 అక్టోబర్ (హి.స.) దేశంలో జనాభా దామాషా ప్రకారం వెనుకబడిన కులాలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని అందులో భాగంగానే కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో
పాండిచ్చేరి మాజీ సీఎం


నాగర్ కర్నూల్, 12 అక్టోబర్ (హి.స.)

దేశంలో జనాభా దామాషా ప్రకారం వెనుకబడిన కులాలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని అందులో భాగంగానే కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్లినట్లు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ బీసీ జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ అమలు జరిగేలా న్యాయపరమైన చిక్కులు లేకుండానే ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు తెలిపారు.

ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో 52%, తమిళనాడులో 69% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్ధత సాధించగా రాష్ట్రంలోనూ జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా జీవో నెంబర్ 9 విడుదల చేసినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande