ఖమ్మం, 12 అక్టోబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పాల్వంచ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రిని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందచేశారు. పాల్వంచ పట్టణంలోని యన్. యమ్. డీ. సి ప్లాంట్ 450 ఎకరాల గల ప్లాంట్ ఖాయిలాపడడం వల్ల ఉపాధి కోల్పోతున్నామని, గతంలో ఉన్న ప్లాంట్ ను అభివృద్ధి చేసి పునరుద్దరించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి వచ్చే నెలలో సీ. యం. డీ తో మాట్లాడి ప్లాంట్ అభివృద్ధికి కృషి చేస్తానని నాయకులకు హామీ ఇచ్చారు. ముందుగా మంత్రికి బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణోత్ బాలు నాయక్, యర్రంశెట్టి ముత్తయ్య, బాణోత్ రాము నాయక్, సక్రు నాయక్, రవి నాయక్ లు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు