హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అలా అని మాకు శత్రుత్వం కూడా ఎవరితోనూ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాము సైద్ధాంతికంగా రాజీపడటం లేదని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. ఇటీవల సీఎం రేవంత్ ఫోన్ చేసి నన్ను కలవాలని అంటే వెళ్లి కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..