హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆలయం మూసివేస్తే పంచలు కట్టుకుని వచ్చి మరీ ఆలయం తలుపులు తెరుస్తామన్నారు. ఫైరింగ్ చేస్తారో లాఠీచార్జి చేస్తారో చూద్దామని చెప్పారు. ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఆలోపు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు