హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్థి నవీన్ యాదవ్కు ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పులిబిడ్డ పులే అవుతుంది కానీ పిల్లి అవ్వదు.. కాబట్టి నవీన్ యాదవ్ టైగర్ అని కొనియాడారు.
నవీన్ యాదవ్కు మంచి భవిష్యత్, గొప్ప పేరు ఉందని నమ్ముతున్నానని అతడి రాజకీయ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు