అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)
నెల్లూరు: నగరంలోని బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అనంతరం హోటల్లో చిక్కుకున్న 30 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ అజిత వెజెండ్ల పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం.. ఎవరికి గాయాలు కాలేవని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ