భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్రం ప్రకారమే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
ప్రభుత్వ విప్


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

వేములవాడ ఆలయ అభివృద్ధి

పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్రం ప్రకారమే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు.

రాజన్నకు నిత్యపూజలు ఏకాంతంగా జరుగుతాయని వెల్లడించారు. పనులు జరిగే క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు అంతకుముందు వేములవాడలోని రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande