జూబ్లీహిల్స్ లో ఓటుకు రూ.10 వేలు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్
కేటీఆర్


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం కేటీఆర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెప్పితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదని అన్నారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. బైపోల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.10వేలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande