హిందూపురం, 12 అక్టోబర్ (హి.స.)హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తుమ్మలకుంటలో బాలయ్య డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్భించారు. ఈ సందర్భంగా బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంలో కాలేజీలు గోడలకే పరిమితం అయ్యాయని అన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అని చెప్పారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న తపనతోనే వైసీపీ తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని, అనవసరమైన ఆరోపణలు చేస్తుందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV