నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు
అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)దివంగత సీఎం, నటుడు సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిస్టింగ్విష్డ్ అవార్డు వచ్చినట్లు ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భం
నారా భువనేశ్వరి


అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)దివంగత సీఎం, నటుడు సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిస్టింగ్విష్డ్ అవార్డు వచ్చినట్లు ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా తన సోదరికి అభినందనలు తెలిపారు. ప్రజాసేవ, సామాజిక రంగాల్లో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. ఈ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంకులను తన సోదరి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారని, ఈ అత్యున్నత అవార్డు ఆమెను వరించడం గర్వంగా ఉందన్నారు. భువనేశ్వరి మరిన్ని అవార్డులు అందుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande