విశాఖపట్నం, 12 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది. నగరంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తాజాగా శంకుస్థాపన చేశారు.
నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ సిఫీ టెక్నాలజీస్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. దాని అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. కేవలం డేటా సెంటరే కాకుండా, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV