ఘోర విషాదం.. నానమ్మను, మనవరాలిని తొక్కి చంపిన ఏనుగు
కోయంబత్తూర్, 13 అక్టోబర్ (హి.స.) తోటలో నివాసం ఉంటున్న మహిళ, ఆమె మనవరాలిపై ఏనుగు దాడి చేసింది. ఈ విషాద సంఘటన సోమవారం తెల్లవారు జామున కోయంబత్తూరు జిల్లా వాల్పరై సమీపంలో చోటు చేసుకుంది. ఉదయం ఒక్కసారిగా తోట లోకి చొరబడ్డ అడవి ఏనుగు అక్కడ నివసిస్తున్
ఏనుగు


కోయంబత్తూర్, 13 అక్టోబర్ (హి.స.)

తోటలో నివాసం ఉంటున్న మహిళ,

ఆమె మనవరాలిపై ఏనుగు దాడి చేసింది. ఈ విషాద సంఘటన సోమవారం తెల్లవారు జామున కోయంబత్తూరు జిల్లా వాల్పరై సమీపంలో చోటు చేసుకుంది. ఉదయం ఒక్కసారిగా తోట లోకి చొరబడ్డ అడవి ఏనుగు అక్కడ నివసిస్తున్న మహిళపై, ఆమె చిన్న మనవరాలిపై దాడి చేసింది. ఈ దాడిలో 55 ఏళ్ల అస్లా, ఆమె మూడేళ్ల మనవరాలు హేమశ్రీ దుర్మరణం పాలయ్యారు. ఏనుగు ఒక్కసారిగా దూసుకువచ్చి వారిని తొక్కడంతో ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు ఆందోళన చెందడంతో అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ బలగాలను ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande