తెలంగాణ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస వ
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో విషాదం

చోటు చేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, జర్నలిజం పట్ల మక్కువతో 1980లో స్థానిక వార్తా సంస్థ NSS ను లక్ష్మారెడ్డి ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేపిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు లక్ష్మారెడ్డి కావడం గమనార్హం. 1999, 2014లో హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. కాగా లక్ష్మారెడ్డి జీవితకాలం కాంగ్రెస్లోనే కొనసాగడం విశేషం. ఆయన మరణ వార్త తెలిసిన తెలుగు రాజకీయ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande