జగిత్యాల జిల్లాలో దొంగల బీభత్సం.. ఒకేసారి నాలుగు ఇండ్లలో చోరీ
జగిత్యాల, 13 అక్టోబర్ (హి.స.) జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దాటాక నాలుగు ఇండ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకుని వెళ్లారు. గ్రామంలోని వేరు వేరు వార్డు
దొంగలు


జగిత్యాల, 13 అక్టోబర్ (హి.స.)

జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దాటాక నాలుగు ఇండ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకుని వెళ్లారు. గ్రామంలోని వేరు వేరు వార్డులలోని నాలుగు ఇళ్లలో ఒకే రోజు రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం జరిగిన తీరును బట్టి చూస్తే ముందుగానే గ్రామంలో రెక్కీ నిర్వహించిన దొంగల ముఠా తాళం వేసిన ఇండ్లను గుర్తించి, ఇక ఆదివారం రాత్రి విలేజ్ లో పెళ్లి భరాత్ కూడా ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా టార్గెట్ చేసిన ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. సుమారు పది తులాల బంగారం, వెండి 45 తులాలతో పాటు 2 లక్షల 20 వేలకు పైగా నగదు,ఓ ద్విచక్ర వాహనాన్ని సైతం దోచుకొని వెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande