హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి లాంటి దివాళా కోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారు... ఇప్పుడు ఎమ్మెల్సీ అంటూ అజారుద్దీన్ను మభ్యపెట్టి పక్కకు పెట్టారని విమర్శించారు. అజారుద్దీన్ను ఎలా మోసం చేశారో.. సేమ్ బీసీలను కూడా అలాగే మోసం చేశారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మంచి.. చివరకు కోర్టుల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని.. అందుకే ఇదే సరైన సమయం అని అన్నారు. జూబ్లీహిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండు కు తగలాలని పిలుపునిచ్చారు. కారు కావాలో.. బుల్డోజర్లు కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్రమాలకు తెరతీశారు.. జూబ్లీహిల్స్ లో ఒకే ఇంట్లో 43 ఓట్లు రాయించారని ఆరోపించారు. దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్లో సాధారనంగా ఓటింగ్ తక్కువ ఉంటుంది.. బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఓట్లు వేసేలా చూసుకోవాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు