సూర్యాపేట, 13 అక్టోబర్ (హి.స.) సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు పచ్చ కామెర్ల వ్యాధి లక్షణాలు బయటపడటంతో జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలు చేపట్టినప్పటికీ వ్యాధి విస్తరిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల విద్యార్థులు కామెర్ల వ్యాధితో బాధపడుతుండటాన్ని గుర్తించిన వైద్యశాఖ జిల్లా వైద్య అధికారి బృందంతో కలిసి స్కూల్ పరిసరాలను పరిశీలించి, వ్యాధి వ్యాప్తి కారణాలను విశ్లేషించింది.
ముందస్తు చర్యగా వైద్యశాఖ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పటికీ, కొత్తగా మరి కొంతమంది విద్యార్థులకు వ్యాధి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల వ్యాధి తీవ్రతను బట్టి ఖమ్మం, సూర్యాపేట, నార్కెట్ పల్లి, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు మెరుగైన వైద్యo కోసం తీసుకువెళ్లినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు