కర్నూలు , 16 అక్టోబర్ (హి.స.) కాసేపట్లో ప్రధాని మోడీ కర్నూలు జీఎస్టీ బహిరంగ సభ(Kurnool GST public meeting)కు చేరుకోనున్నారు. శ్రీశైలం(Srisailam) పర్యటన ముగియడంతో హెలికాప్టర్‌లో బయల్దేరారు. మోడీ వస్తుండటంలో సభ వద్దకు కూటమి నాయకులు భారీగా చేరుకున్నారు. ప్రధాని మోడీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కర్నూలు జీఎస్టీ(GST) సభ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులకు విద్యుత్ షాక్ కొట్టింది. దీంతోవారు స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన కూటమి నేతలు.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు మరికాసేపట్లో ప్రధాని మోడీ కర్నూలు జీఎస్టీ వద్దకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV