నిన్న హనుమంతుడు, నేడు విఘ్నేశ్వరుడు.. విగ్రహాల ధ్వంసం కలకలం!
నాగర్ కర్నూల్, 19 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిన్న, నేడు వరుసగా రెండు రోజులలో హిందూ దేవుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాల ధ్వంసం సంఘటనలు కలకలం రేపుతుంది. అందుకు సంబంధించిన స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇ
విగ్రహాల ధ్వంసం


నాగర్ కర్నూల్, 19 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు

మండలంలో నిన్న, నేడు వరుసగా రెండు రోజులలో హిందూ దేవుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాల ధ్వంసం సంఘటనలు కలకలం రేపుతుంది. అందుకు సంబంధించిన స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. 24 గంటల్లో హిందూ దేవీ దేవతల విగ్రహాలపై దాడి జరగడం ఇది రెండోసారని, నిన్న హనుమంతుడి విగ్రహాన్ని విరగొట్టిన సంఘటనను మరవకముందే.. నేడు విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మండలంలోని బాణాల గ్రామంలో చోటుచేసుకుందని వాపోయారు.

వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. హిందూ సమాజాన్ని, హిందువుల నమ్మకాలను అపహాస్యం చేస్తూ విద్వేషకారులు సరిగ్గా పండగల ముందు హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టు దుశ్చర్యలు జరుగుతున్న వారి ఆట కట్టించి శాంతియుత వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande