హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను
కేంద్రం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఛలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నేతలు రాజ్ భవన్ వద్దకు వెళ్లారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే రాజ్ భవన్ వద్దకు వెళ్లిన నేతలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అపాయింట్మెంట్ నిరాకరించారు. దీంతో గేటు ముందే సీపీఎం నేతలు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చే వరకు గేటు ముందే బైఠాయిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు గవర్నర్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ వద్దకు వెళ్లిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సహా ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు