హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
దసరా సెలవులు అంటూ మూసివేసిన కళాశాల తదనంతరం కూడా తెరుచుకోలేదు. సెలవులు ముగిసిన అనంతరం కళాశాలకు వస్తున్న విద్యార్థులకు తాళం వేసిన గేట్లు దర్శనమిస్తున్నాయి. విషయం ఏమిటనీ ఆరా తీస్తే అద్దె కట్టడం లేదని సదరు భవన యజమాని కాలేజీ మూసివేసినట్లు తెలుసుకున్న విద్యార్థులు అవాక్కయ్యారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ లో కే . వెంకన్న జూనియర్ కాలేజ్ పేరిట ఓ ప్రవేట్ అద్దె భవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిలో దాదాపుగా 180 మంది విద్యార్థులు చదువుతున్నారు.
గత నెల ఆఖరి వారంలో దసరా సెలవులు అంటూ మూసివేసిన కాలేజీ సెలవులు ముగిసిన తర్వాత కూడా తెరుచుకోలేదు. రోజు కళాశాల మూసి ఉంచడంతో శుక్రవారం విద్యార్థులు కాలేజీ ముందు ఆందోళన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు