స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యను వరించిన మంత్రి పదవి..
జామ్ నగర్, 17 అక్టోబర్ (హి.స.) స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యను మంత్రి పదవి వరించింది. గుజరాత్ లో గురువారం సీఎం భూపేంద్ర మినహా మంత్రులు అంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రాష్ట్రంలో నూతన కేబినెట్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో జడ
క్రికెటర్ రవీంద్ర జడేజా


జామ్ నగర్, 17 అక్టోబర్ (హి.స.)

స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యను

మంత్రి పదవి వరించింది. గుజరాత్ లో గురువారం సీఎం భూపేంద్ర మినహా మంత్రులు అంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రాష్ట్రంలో నూతన కేబినెట్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో జడేజా చోటు భార్య రివాబా జడేజా సైతం కేబినెట్లో దక్కించుకున్నారు. 2019లో రివాబా బీజేపీలో చేరారు. తరవాత 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జామ్ నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. ఎన్నికల సమయంలో రవీంద్ర జడేజా సైతం తమె తరపున ప్రచారం చేయగా 50వేల కంటే ఎక్కువ మెజారిటీతో రివాబా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక తాజాగా ఆమెకు మంత్రి పదవి దక్కడంతో జడేజా అభిమానులు కుషీ అవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande