హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
బీసీల హక్కుల కోసం బీసీ సంఘాల
జేఏసీ పిలుపునిచ్చిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..