కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నది.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, 17 అక్టోబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ షెడ్యూల్ ప్రకారం
భట్టి విక్రమార్క


ఖమ్మం, 17 అక్టోబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ షెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన కూడా నెలల తరబడి బిల్లు గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన కూడా కేంద్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసుకొస్తుంటే బిజెపి కావాలని కాలయాపన చేస్తుందని అన్నారు. బీసీలకు బిజెపి వ్యతిరేకత అని ఆరోపించారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై అభిప్రాయం చెప్పాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande